పేదలకు అండగా ఉండాలన్నదే బీఆర్‌ఎస్ లక్ష్యం
కోట్ల కుటుంబ సభ్యుల సేవలు చిరస్మరణీయం
- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- 37వ వార్డుకు ప్రత్యేక అంబులెన్స్ అందిస్తాం : కోట్ల ప్రభాకర్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 6 : పేదలకు అండగా ఉండాలన్నదే బిఆర్‌ఎస్ సంకల్పమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం 37 వ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి రాణి కోట్ల నర్సింహులు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కోట్ల కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమ కోసం పాటుపడతారని స్పష్టం చేశారు. మీలో ఒకడిగా ఉంటూ ఎల్లప్పుడూ మీ అందరి సంతో షం కోసం పాటుపడుతున్న రాణి కోట్ల నరసింహులు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయాలని పేర్కొన్నారు.
- 37వ వార్డుకు అంబులెన్స్..: కోట్ల ప్రభాకర్
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని సంకల్పంతో కేవలం 37వ వార్డుకు మాత్రమే ఉపయోగపడేలా అంబులెన్స్ ను అందుబాటులో ఉంచుతామని కోట్ల కుటుంబ సభ్యులు కోట్ల ప్రభాకర్ ప్రకటించారు. చతిస్ ఘడ్ రాష్ట్రంలో మా మా అన్న గుండెపోటుతో మరణిస్తే అక్కడి నుంచి మన రాష్ట్రానికి తీసుకురా వచ్చేందుకు అంబులెన్స్ అందుబా టులో లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఇప్పటికిప్పుడు గుర్తుకు వచ్చి ఈ వార్డుకు ప్రత్యేక అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు.
ప్రజల నుంచి ఆశించి రాజకీయంలోకి రావడం లేదని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని సంకల్పంతోనే పోటీలో నిలిచినట్లు తెలిపారు. అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని సంకల్పంతోనే ఈ వార్డుకు ప్రత్యేకంగా అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ప్రజలు మద్దతు తెలియజేయాలని ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఓటర్లు పాల్గొన్నారు.






