కలాం ఆశయాలను నెరవేర్చినప్పుడే నిజమైన నివాళి
లీడ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ ఎన్బీ సుదర్శన్ ఆచార్య, ఫౌండర్ సభ్యుడు, ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి
ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీ జే అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో పెట్టి నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని లీడ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ ఎన్బీ సుదర్శన్ ఆచార్య, లీడ్ ఇండియా ఫౌండర్ సభ్యుడు, ట్రస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి అన్నారు. శంషాబాద్లోని అమ్మపల్లిలో గల లీడ్ ఇండియా భవన్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ కలాం స్ఫూర్తితో లీడ్ ఇండి యా ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 67 వేల మంది ఉపాధ్యాయులు, 7 వేల మంది ప్రిన్సిపాళ్లు, 22 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించామని తెలిపారు. 2047 నా టికి భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దే లక్ష్యం తో మరింత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు కృషి చేస్తు న్నామన్నారు. ‘కలలు కనండి... ఆ కలలను నిజం చేసుకునే వరకు ఆగకండి‘ అనే డాక్టర్ కలాం సందేశం యువతకు శాశ్వత స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. దేవేందర్ రెడ్డి, థామస్, సంతోష్, అమన్, ట్రస్మా, లీడ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు.






