17 August, 2026 | 3:46 AM

ముత్యాలమ్మకు వింత మొక్కు!

17-08-2026 02:02 AM

ముక్కుపుడక, చెవి దిద్దుల కోడి సమర్పణ 

మహబూబాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): అనారోగ్యానికి గురైన దంపతులకు ఆరోగ్యం కుదుట పడడంతోపాటు ఇంటిల్లిపాది సుఖశాంతులతో జీవించడానికి ముత్యాలమ్మ తల్లి కరుణాకటాక్షాలు దండిగా ఉన్నాయం టూ.. ఆ తల్లి చూడాల ని బోనం సమర్పించ డంతోపాటు.. బంగా రు ముక్కుపుడక, చెవి దుద్దులు, హారంతో అ లంకరించి అమ్మవారికి బలిస్తూ.. వినూత్న రీతిలో ముక్కుతీ ర్చుకుంటున్నారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలి టీ పరిధిలోని తోడేటి వెంకన్న పార్వతి దంపతులు.

ఏటా ముత్యాలమ్మకు బోనాలు సమ ర్పించే రోజు కోడి పుంజును అందంగా తీర్చిదిద్ది, ముక్కుపుడక, చెవి దుద్దులు, మెడలో హారం, మద్యం సీసా అలంకరించి అమ్మవారికి మొక్కుగా సమర్పించడం గత 15 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అమ్మ ద యతో తమ తమ కుటుంబానికి ఏలోటు రాదని, అందుకే ప్రత్యేకంగా ఇలా ప్రతిఏటా మొక్కు తీర్చుకుంటున్నట్లు ఆ దంపతులు పేర్కొంటున్నా రు. ఆదివారం నిర్వహించిన ముత్యాల మ్మ బోనాల పండుగ సందర్భం గా వెంకన్న పార్వతీ దంపతులతో పాటు కు టుంబ సభ్యులు వింత మొక్కు కోడితో తరలివచ్చి అ మ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.