17 August, 2026 | 4:19 AM

బోనాల వేడుకల్లో పాల్గొన్న నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్

17-08-2026 02:04 AM

కేసముద్రం, ఆగస్టు 16 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలో నిర్వహించిన ముత్యాలమ్మ బోనాల పండుగ వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాయిత్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించే విధంగా కరుణ చూపాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ను ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఘనంగా సత్కరించారు.