వీరనారి!
01-05-2026 12:00 AM
చెమట సంద్రంలో నల్లటి నారి!
కాయకష్టంతో కాయదేరిన కాయం
వీపు సింహాసనంపై
బోసినవ్వుల పసివాడు!
స్వేదంతో ఆకలి తీరుస్తూ
పేగుబంధాన్ని కొంగుబంధంతో ముడేసి
అంగరక్షకురాలై బతుకు
యుద్ధం చేస్తుంది
నాడు స్వేచ్ఛ కోసం వీపున బిడ్డతో
పోరాడిన లక్ష్మీబాయి వీరనారయితే!
నేడు ఆకలి కోసం
కడుపునో వీపునో బిడ్డతో
కష్టించే కార్మికులంతా
వీరనారీమణులే!
అది ఆఖరి యుద్ధం
ఇది ఆకలి యుద్ధం
ఎక్కడ పోరాటం ఉంటే అక్కడ
ఓ లక్ష్మీబాయి ఉంటుంది
ఓ రుద్రమదేవి ఉంటుంది
ఓ మాంచాల ఉంటుంది..
బతుకు పోరాటంలో ప్రతి వనిత
వెనకడుగు వేయని మన చరిత
నిస్వార్థపూరిత త్యాగశీలత!
భీమవరపు
పురుషోత్తమ్
9949800253






