calender_icon.png 11 September, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం

04-09-2025 12:14:31 AM

కరీంనగర్, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు కరీంనగర్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. రాజీవహదారి గుండ్లపల్లి వద్దకు చేరుకోగానే తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, ఎడ్ల జోగిరెడ్డి, వేల్పుల ఓదయ్య యాదవ్, రామిడి మల్లారెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణారావుతో కలిసి స్వాగతం పలికారు.

కరీంనగర్ అల్గునూరు చౌరస్తా వరకు చేరుకోగానే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మేయర్ వై సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడ అంబేద్కర్ వి గ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం సమావేశం జరిగిన వేదిక వద్దకు భారీ ప్రదర్శనతోతరలివెళ్లారు.