11-09-2025 01:52:22 PM
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. మహేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని సీతక్క ఓదార్చారు. కుటుంబానికి రూ.5 లక్షల ఎక్సగ్రేషియా చెక్‌ను మంత్రి అందజేశారు. త్వరలో ఇన్సురెన్స్ మొత్తం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మైదం మహేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మృతుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఆర్థిక సహాయం చేయండి కానీ మృతుడి పేరుతో భిక్షమడిగి మృతున్ని అవమాన పరచొద్దని సూచించారు.