11-09-2025 01:45:35 PM
మంథని,(విజయ క్రాంతి): మంథని మున్సిపాలిలోని ఎంపీపీ ఎస్ గర్ల్స్ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ - (మంచు లక్ష్మీ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), సినీనటి మంచు లక్ష్మితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.