calender_icon.png 11 September, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

11-09-2025 01:11:24 PM

జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ 

కుమ్రంభీంఅసిఫాబాద్, (విజయక్రాంతి): అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌  అధికారి శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

అటవీ అధికారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కలప స్మగర్లతో తీవ్ర వాదులతో పోరాటం చేసి, వారు చేసిన దాడులలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమరవీరుల అత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి సేవలను గుర్తు చేశారు. ఇప్పటివరకు 3 దశాబ్దాలలో దాదాపు 30 మంది అటవీ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అధికమంది కలప స్మగ్లింగ్ కాంట్రాక్తర్ల చేతిలో అమరులైననూ కొందరు వన్యప్రాణుల బారి నుంచి, మరికొందరు నక్సలైట్ల దాడులతో ప్రాణాలు వదిలారని తెలిపారు. ఏది ఏమైనా అడవుల సంరక్షణ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అన్నారు. సిబ్బంది వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అడవుల సంరక్షణ లో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్అధికారి గోవింద్ చంద్ సర్దార్, తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, డిప్యూటీ రేంజ్ అధికారిని ఝాన్సీరాణి, ఏవో వెంకటకృష్ణ, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.