11-09-2025 01:09:43 PM
హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలింపు
చర్ల, (విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు దాడికి గురయ్యారు. బర్సూర్ ప్రాంతంలోని సత్ధర్, మాలేవాహి మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు ఐ ఈ డి దాడికి గురయ్యారు. గాయపడిన సైనికులను దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధ్రువీకరించారు.