ప్రతి పౌరుడికి సంక్షేమ కార్డు
- పూర్తి వివరాలన్నీ ఒకే చోట
- అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించండి
- ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ తదితరులు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా, ఒకే చోట వివరా లు ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారు లను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏయే సంక్షే మ పథకాలు వర్తిస్తున్నాయి, ఎంత ఆర్థిక లబ్ధి చేకూరుతుందో ఈ కార్డు ద్వారా తెలిసే లా స్పష్టంగా ఉండాలని సూచించారు. స్పె షల్ డ్రైవ్ చేపట్టి అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటా సేకరించాలని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీ ఎం ఈ విషయంపై చర్చించారు.
సమగ్ర సం క్షేమ కార్డు ద్వారా ప్రతి పౌరుడి పూర్తి ప్రొఫై ల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి విశ్లేషిస్తే పథకాల అమలులో పారదర్శకత పెరు గుతుందని, నిజమైన అర్హులకు సంక్షేమ ఫ లాలు కచ్చితంగా చేరుతాయన్నారు. అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుంద ని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు జారీ చే యాలని ముఖ్యమంత్రి సూచించారు. టెక్నాలజీపై పట్టుండి, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని పేర్కొన్నారు.
హెల్త్ ప్రొఫైల్‌ను లింక్ చేయాలి
ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను సంక్షేమ కార్డు కు అనుసంధానం చేయాలని, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను సైతం లింక్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సంక్షే పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇతర వివరాలను సేకరిం చాలని ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని, అవసమైతే ఆధార్ తరహా లో ప్రత్యేక యూనిక్ నంబర్ ఇవ్వాలని పే ర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పింఛన్ డేటాబేస్‌కు చేరాలని, దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగుల విషయంలో కేరళ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల ని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు పాస్‌పోర్టు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు కచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సంక్షే మ కార్డు ఉండేలా స్పష్టం చేశారు.






