16 July, 2026 | 10:30 AM

చెరువులో పడి మహిళ మృతి

26-10-2024 01:05 AM

కామారెడ్డి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌కి చెందిన నీరడి చంద్రవ్వ(55) మతిస్థిమితం సరిగా లేక చెరువులో పడి మృతిచెందింది. రాజంపేట ఎస్‌ఐ పుష్పరాజ్ తెలిపిన వివారలు.. గురువారం మధ్యాహ్నం చంద్రవ్వ తల్లిగారి ఊరైన లింగాయిపల్లికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయింది.

అయితే రాత్రికి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు చంద్రవ్వ కోసం వెతుకగా మామిడి చెరువులో చంద్రవ్వ మృతదేహం కన్పించినట్లు మృతురాలి భర్త కిష్టయ్య తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.