10 April, 2026 | 2:40 AM

క్యాన్సర్‌ను జయించిన మహిళ

10-04-2026 12:53 AM
  1. మారథాన్ రన్నర్‌గా గెలుపు
  2. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యుల ప్రోత్సాహం

హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతారు. అయితే సమయానికి వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను జయించి తిరిగి సాధారణ జీవితాన్ని గడపవచ్చని, అంతేకాకుండా కలలను కూడా నెరవేర్చుకోవచ్చని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, హైటెక్ సిటీలో చికిత్స పొం దిన 40 ఏళ్ల మహిళ నిరూపించారు.స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్‌ను జయించి, ప్రస్తుతం మారథాన్ రన్నర్‌గా నిలుస్తూ ఇతర క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తిగా మారుతున్నారు.

కొంతకాలం క్రితం ఆమెకు స్టేజ్ ౨ బ్రెస్ట్ క్యాన్సర్ (టీ1ఎన్1ఏఎంఓ) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ (ఈఆర్/పీఆర్+), హెచ్‌ఈఆర్ 2 నెగటివ్ రకానికి చెందిన క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. వెంటనే మెడికవర్ క్యాన్స ర్ ఇనిస్టిట్యూట్ నిపుణుల బృందం మల్టీ-డిసిప్లినరీ విధానంలో చికిత్స ప్రారంభించిం ది. మొదట ఆమెకు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ నిర్వహించారు. అనంతరం అడ్జువెంట్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అందించారు.

హార్మోన్ సెన్సిటివ్ వ్యాధి కావడంతో, లాంగ్ టర్మ్ హార్మోన్ థెరపీతో పాటు ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్లు కూడా అందించారు. చికిత్స సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఆమె ధైర్యం కోల్పోకుండా వైద్యు ల సూచనలు పాటిస్తూ ముందుకు సాగారు. చికిత్స పూర్తయిన ఐదేళ్ల తర్వాత కూడా ఆమె పూర్తిగా ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉ న్నారు. ముఖ్యంగా, చికిత్స అనంతరం తిరిగి తనకు ఇష్టమైన రన్నింగ్‌ను ప్రారంభించి, ప్రస్తుతం మారథాన్లలో పాల్గొంటూ స్ఫూర్తిదాయక జీవితం గడుపుతున్నారు.

ఆమె పాల్గొనే ప్రతి మారథాన్, క్యా న్సర్‌పై సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంగా మెడికవర్ క్యా న్సర్ ఇన్స్టిట్యూ ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంతిమ తీర్పు కాదు. సమయానికి వ్యాధిని గుర్తిస్తే, సరైన చికిత్సతో పూర్తిగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు.

ఈ రోగి కథ ప్రతి మహిళకు ఆశను ఇస్తుంది. కేవలం వ్యాధిని జయిం చడమే కాదు, తిరిగి తన కలలను సాధించవచ్చని ఆమె నిరూపించారు. ఈ స్ఫూర్తిదా యక కథ, క్యాన్సర్ అనేది జీవితం ముగిసిందనే కాదు.. కొత్త జీవితానికి, కొత్త ఆశలకు ప్రారంభమని గుర్తుచేస్తోంది.