12 March, 2026 | 10:36 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు

27-10-2024 12:44 PM

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో ఓ యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో యువకుడు హాస్టల్‌లోకి వెళ్లి కాసేపు తర్వాత తిరిగి వెళ్లిపోవడం బాలికల హాస్టల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై హాస్టల్ ఇంఛార్జ్ వార్డెన్ సోమలత చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అర్ధరాత్రి పూట ఓ యువకుడు బాలికల హాస్టల్‌లోకి వెళ్తుంటే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఎటు వెళ్లారు? ఏం చేస్తున్నారు? అని బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని సంబంధిత సిబ్బందిపై, హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.