12 March, 2026 | 8:52 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నాగర్ కర్నూల్ కు బయల్దేరి వెళ్లిన మాల మహానాడు నాయకులు

27-10-2024 12:53 PM

కామారెడ్డి (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ లో నిర్వహిస్తున్న మాలల ఆత్మగౌరవ బహిరంగ సభకు ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గం మండలాలు గ్రామాల నుంచి మాల మహానాడు నాయకుడు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. అప్పటివరకు ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లూరు సాయిలు, వెంకటేష్, నర్సింహులు, జగన్, మోహన్, ప్రశాంత్, మన్నెచిన సాయిలు, శివయ్య, సురేష్, వినోద్, ఆనంద్, వెంకటరత్నం, గంగారాం, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.