17 June, 2026 | 12:23 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

15-12-2025 12:00 AM

కుభీర్, డిసెంబర్ ౧౪ (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి  చెందిన రాంబోల్ నవీన్, రాంబో శ్యామ్ అనే ఇద్దరు మండలంలోని సిర్పెల్లి తండా (1) గ్రామం లో జరిగే ఒక ఫంక్షన్ లో టెంట్ (షామియానా) వేసేందుకు వెళ్లారు. గ్రామానికి అనుకొని చేనులో టెంటు వేస్తున్న రాంబోల్ నవీన్ (24) దానికి ఇనుప పోల్ బిగించే క్రమంలో పైన ఉన్న 11 కెవి విద్యుత్ తీగలను గమనించక పోవడంతో ఆ తీగలు  చేతిలో ఉన్న ఇనుప పోల్‌కు ఆనుకోవడంతో కరెంటు సరఫరా జరిగి షాక్‌కు గురై కింద పడిపో యాడు.

గమనించిన శ్యామ్ ఆయనను కాపాడే క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. విద్యుత్ సరఫరాను నిలిపివే యించి హుటాహుటిన ఆయనను భైంసా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నవీన్ మృతి చెందా డు. స్వల్ప గాయాల పాలైన శ్యామ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నవీన్ కరెంట్ షాక్ తో మృతి చెందిన విషయం తెలుసుకున్న కుబీర్ లోని గణేష్ నగర్, న్యూ అబాదిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి రాంబోల్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు కుభీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి వివరించారు.