15-12-2025 12:00:00 AM
బెల్లంపల్లి, డిసెంబర్ 14 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గం లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,37,382 ఓటర్లకు గాను 116,205 (84.59 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నా రు. పోలింగ్ నిర్వహణ కోసం బెల్లంపల్లి నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో 996 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు.
బెల్లంపల్లి మండలంలో 85.30 శాతం, భీమినీలో 89.90 శాతం, కన్నెపల్లిలో 90.37 శాతం, కాసిపేటలో 78.74 శాతం, నేన్నెలలో 89.08శాతం, తాండూర్‌లో 78.52 శాతం, వేమనపల్లి లో 89.00 శాతం నమోదైంది. ఎన్నికలను పురస్కరించుకొని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కుమార్ దీపక్ నియోజవర్గంలోనీ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళినీ అడిగి తెలుసుకున్నారు.