calender_icon.png 16 December, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటుకు.. వయస్సు అడ్డు కాదు

15-12-2025 12:00:00 AM

ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14(విజయ క్రాంతి): నేటి తరంలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత సైతం ఆసక్తి చూపడం లేదు అలాంటిది 105 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొని నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. దహేగాం మండలంలోని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు రసూల్ ఇట్యాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించి ఆదర్శంగా నిలిచారు. వయసు పైబడినప్పటికీ ఆమె ఆసక్తిగా వచ్చి ఓటు వేయడం స్థానికులకు స్ఫూర్తినిచ్చింది. అధికారులు ఆమెకు సహాయం అందించారు. ఆమె ఓటు నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయం.