calender_icon.png 16 September, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి మత్తులో యువకుడి వీరంగం

15-07-2024 12:25:31 AM

ఇనుపరాడ్డుతో వ్యక్తిపై దాడి.. పరిస్థితి విషయం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): గంజాయి మత్తులో ఓ యువకుడు వ్యక్తిపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. అంబేద్కర్‌నగర్ రాయన్న కాలనీలో గంజా యి మత్తులో ఉన్న శివ రోడ్డుపై వెళ్తున్న రాంబాబుపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాంబాబును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గంజాయి మత్తులో యువకు లు దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబాబుకు న్యాయం చేయాలని,  గంజాయి సేవిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాంబాబుపై దాడికి పాల్పడిన శివపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో స్థానికులు ధర్నా విరమించారు.