16 March, 2026 | 9:15 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

కులగణనతోనే బీసీలకు న్యాయం

07-08-2024 02:03 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): కులగణన చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ.. కులగణనకు కాంగ్రెస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల సమయం లో తెలంగాణలో ప్రకటించారని గుర్తుచేశారు. అందుకు తెలంగాణ నుంచే కులగణన ప్రారంభం కావాలన్నారు.  కులగణనతో బీసీ జనాభా తేలి, తద్వారా రిజర్వేషన్లు పెం చడానికి అవకాశం ఉంటుందని కృష్ణయ్య తెలిపారు.  ఎంపీలు మస్తాన్‌రావుయాదవ్, మల్లు రవి, బాబురావు, నాగరాజు, అప్పలనాయుడు, బీసీ నేతలు ఆర్ లక్ష్మణ్‌యాదవ్,  గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు.