29 July, 2026 | 3:51 AM

జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా?

27-05-2024 12:29 AM

న్యూఢిల్లీ, మే 26: దేశంలో ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆధార్‌కార్డు తప్పనిసరి అయ్యింది. దీంతో ఆధార్‌కు సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా క్షణాల్లో వైరల్ అవుతున్నది. ఇటీవల ఓ వ్యక్తి జూన్ 14 తర్వాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చెప్పటంతో కలకలం రేగింది. అయితే, అదంతా అబద్ధమని తేలింది. గత పదేండ్లుగా ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోనివారిని వెం టనే అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. జూన్ 14వ తేదీ వరకు ఆధార్ పోర్టల్‌లో పూర్తిగా ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 14 తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వక్రీకరించి అప్‌డేట్ చేసుకోకపోతే జూన్ 14 తర్వాత అసలు కార్డులే పనిచేయవని ప్రచారం చేస్తున్నారు.