29 July, 2026 | 3:10 AM

గాలి కాలుష్యంతో మధుమేహం

27-05-2024 12:35 AM

ముంబై, మే 26: కలుషిత గాలి పీల్చితే టైప్‌ డయాబెటిక్ సమస్య పెరిగే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2.5 ఎంపీకంటే ఎక్కువ కాలుష్య కణాలున్న గాలిని పీల్చటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్టు తెలిపారు. జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండి యా (జాపీ)లో ఈ పరిశోధన ఫలితాలు వెల్లడించారు. కాలుష్య కారకాలు రక్తంలో కలిసి శరీర కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించకుండా అడ్డుపడుతున్నాయని, దీంతో చక్కెర స్థాయిలు పెరగుతున్నాయి. చెన్నైకి చెందిన ప్రముఖ డయాబెటాలజిస్ట్ వీ మోహన్ తెలిపారు. 

గాలి కాలుష్యం వల్ల అనర్ధాలు

1. భూమిపై ప్రతి పదిమందిలో 9 మంది కాలుష్యమయమైన గాలిని పీలుస్తున్నారు.

2. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 లక్షల మంది మరణిస్తున్నారు.

3. గాలి కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, దీర్ఘకాలిక వ్యా ధులు, బ్రాంకైటిస్, క్యాన్సర్ వంటి వ్యా ధులు వస్తున్నాయి. 

4. గాలి కాలుష్యంతో మనుషుల్లో చెవిటితనం కూడా వస్తున్నది.

పలు నగరాల్లో 2020లో గాలికాలుష్య కారక మరణాలు

            నగరం                               మృతుల సంఖ్య

ఢిల్లీ (ప్రపంచంలోనే అధికం)                       54,000

టోక్యో                                               40,000

షాంఘై                                                       39,000

బీజింగ్                                               34,000

ముంబై                                                        25,000