21 May, 2026 | 2:39 AM

ఆధార్ ఫేస్ నిర్దారణ కేంద్రం ప్రారంభం

21-05-2026 12:02 AM

ములకలపల్లి, మే 20 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ రేగులకుంట గ్రామంలో బుధవారం ఆధార్ ఫేస్ నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పరిధిలోని పింఛను లబ్ధిదారులందరూ ఆధార్ పేస్ అంతేంటేకేషన్ (నిర్దారణ)ను పంచాయతీ కార్యాలయం నందు చేయించుకోవాలని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ కోరారు. లేని యెడల పింఛను రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సిందిగా సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి  ఇబ్రహీం,సూపర్ వైజర్ సురేష్  ఉన్నారు.