ఢిల్లీ పెద్దలతో బీజేపీ స్టేట్ చీఫ్ భేటీ
రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చ
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బుధవారం ఢిల్లీలోని జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లినట్లుగా తెలిసింది. ఈమధ్య కాలంలో రాష్ట్రంలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు సహా ఇతర కీలక అంశాలపై పార్టీ పెద్దలకు రాంచందర్ రావు నివేదించినట్లుగా తెలుస్తోంది.
త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన ఎత్తుగడలు, ఎస్‌ఐఆర్‌పై చర్చించినట్లుగా తెలిసింది. రాష్ట్రంలో నిర్వహించిన మోదీ బహిరంగ సభపై ఆరా తీసినట్లుగా తెలిసింది. త్వరలో కేంద్ర క్యాబినెట్ విస్తరణ చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో రాంచందర్ రావు భేటీపై ఆసక్తి నెలకొన్నది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారం అంశం కూడా జాతీయ నాయకులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.






