21 May, 2026 | 2:42 AM

చెల్‌గల్‌లోనే కేంద్రీయ విద్యాలయం

21-05-2026 12:00 AM
  1. 10 ఎకరాల భూమి కేటాయించాలి
  2. సీఎంకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ లేఖ

జగిత్యాల, మే 20 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం స్థాపన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. చల్‌గల్‌లోని వాలాంతరీకి చెందిన పది ఎకరాల భూమిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కేటాయించారని, ఈ భూమిని కేంద్రీయ విద్యాలయ పేరిట బదలాయింపు చేయాలంటూ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖలో కోరారు. కేవీఎస్ నిబంధనల ప్రకారం కనీసం 5 ఎకరాల భూమి అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం 2 ఎకరాల భూమిని మాత్రమే ఆమోదించడం దురదృష్టకరమని విమర్శించారు.

చెల్‌గల్ గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం 10 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం, కేంద్రీయ విద్యాలయానికి మాత్రం సరైన భూమి ఇవ్వకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని అన్నారు. నర్సింగపూర్ సమీపంలో ప్రతిపాదించిన స్థలం రహదారి, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాటు చెత్త నిల్వ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల విద్యాసంస్థకు పూర్తిగా అనరమని పేర్కొన్నారు. అందువల్ల చెల్ గల్ గ్రామంలోని 10 ఎకరాల భూమిని వెంటనే కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని, లేకపోతే జగిత్యాల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని లేఖలో పేర్కొన్నారు.