15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేసీఆర్, హరీశ్ రావు చిల్లర పంచాయతీలు పెడుతున్నారు

21-06-2025 02:24 PM

హైదరాబాద్: ఎన్ఓసీ వచ్చాక నీరు వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెబితే.. హరీశ్ రావు తప్పుపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. నీటి విషయంలో సమస్య పరిష్కారం అవుతుందనే భయంతో హరీశ్ రావు ఉన్నారని తెలిపారు. సమస్య పరిష్కారం అయితే మాట్లాడడానికి మరో అంశం ఉండదనే అభద్రత భావంతో ఉన్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), హరీశ్ రావు చిల్లర పంచాయితీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్, హరీశ్ రావు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు చర్యల వల్ల తెలంగాణ నష్టపోయిందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన నుంచే తెలంగాణకు నష్టం జరుగుతోందని విమర్శించారు. రైతులను డైవర్ట్ చేయడానికి బనకచర్ల అంశాన్ని(Banakacherla topic) ముందుకు తెచ్చారని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.