calender_icon.png 8 January, 2026 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ విప్

07-01-2026 12:38:21 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా వేములవాడ అర్బన్ మండలం మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజల సమస్య ను అసెంబ్లీ లో మాట్లాడటం సంతోషమని, త్వరలోనే ముంపు గ్రామాల సమస్యలు విప్ ఆది శ్రీనివాస్ పరిష్కారం చేస్తారని వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ  నేతలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. 4692 ఇండ్లు మంజూరు చేయబడినందుకు  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి, గృహ నిర్మాణ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ముంపు గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.

కొంతమంది గ్రామస్తులు ఇప్పటికే  ఇండ్లను నిర్మించుకున్నారని, ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు ₹5 లక్షల విలువ వారికీ ప్రయోజనం అందేలా రీమాడిఫికేషన్ చేసి, సంబంధిత బిల్లులు చెల్లించేట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసెంబ్లీ లో మాట్లాడారని అన్నారు.  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్  ప్రసంగం మిడ్ మానేరు ముంపు గ్రామాల పునరావాస సమస్యకు ప్రభుత్వ స్థాయిలో తక్షణ పరిష్కారానికి కొత్త దిశనిస్తుందని తెలిపారు.. మండల కాంగ్రెస్ నాయకులు ముంపు గ్రామాల సమస్యలను ఎప్పటికప్పుడు ఆది దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు... కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం రాజు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు శ్రీనివాసరావు, ఎర్రం ఆగయ్య, అర్బన్ గ్రామాల సర్పంచులు ఇటిక్యాల రాజు, కదిరే రాజ్ కుమార్, అన్నబోయిన తిరుపతి యాదవ్,షేర్ల రాజేశ్వరి -మల్లేశం, దొబ్బల మల్లేశం, సీనియర్ నాయకులు,వంగ పర్శరాములు,పండుగ ప్రదీప్, కత్తి కనుకయ్య,గాలిపెల్లి స్వామి, మల్లేశం, బోనాల రమేష్,ముదం శ్రీను కంది రాజి రెడ్డి, అభిమన్యు యాదవ్,కట్ట శ్రీనివాస్,తాడెం శ్రీనివాస్,బొమ్మ ఎల్లయ్య,ఎంబేరి దేవరాజు, బొమ్మ తిరుపతి, చేపూరి సురేష్,కూతురు అనిల్ తదితరులు ఉన్నారు.