6 May, 2026 | 5:23 AM

కర్మస్థలంలాంటి కథ నాకూ చేయాలనుంది

09-03-2025 12:44 AM

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ శర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మస్థలం’. ఈ సినిమాలో బిగ్‌బాస్ ఫేమ్ అర్చన (వేద), మిథాళీ చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగమహేశ్, దిల్ రమేశ్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరోలు ఆకాశ్ జగన్నాథ్, హీరో విజయ్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “కర్మస్థలం’ టైటిల్ చాలా బాగుంది. ఇలా అమ్మవారి గురించి సినిమా చేయటం అభినందనీయం. నేను కర్మను నమ్ముతాను. నాకూ ఇలాంటి కథ చేయాలనుంది’ అన్నారు. నటుడు సతీశ్ సరిపల్లి మాట్లాడుతూ.. “కర్మస్థలం’ నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. రాకీ డెబ్యూ డైరెక్టర్ అయినా తనవైన విజువల్స్‌తో పెద్ద సినిమాలాగా మార్చేశారు’ అన్నారు. హీరోయిన్ మిథాలీ చౌహాన్, నటుడు క్రాంతి కిల్లి, డైరెక్టర్ రాకీ, ప్రొడ్యూసర్ యువరాజ్ పాల్గొన్నారు.