6 May, 2026 | 6:58 PM

నటి రన్యారావు శరీరంపై గాయాలు

08-03-2025 11:47 PM

అత్యవసర చికిత్సకు కోర్టు ఆదేశం...

బెంగళూరు: అక్రమంగా బంగారం రవాణా చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు వ్యవహారంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) లోతైన దర్యాప్తు చేపడుతున్నది. దర్యాప్తులో రన్యా టూర్స్ వెనుక ఓ సిండికేట్ ముఠా హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. అలాగే రన్యా ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ గాయాలు ఆమె దుబాయ్ వెళ్లడానికి ముందు నుంచే ఉన్నట్లు భావిస్తున్నది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నిందితురాలిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆమెను మూడు రోజుల పాటు విచారించేందుకు డీఆర్‌ఐకి న్యాయమూర్తి అనుమతులిచ్చారు. డీఆర్‌ఐ ఇక రన్యా అమెరికా, యూరప్, పశ్చిమాసియా పర్యటనలపై ముమ్మర దర్యాప్తు చేపట్టనున్నది.