11-11-2025 05:42:20 PM
వృద్ధులతో కలిసి రాస్తారోకో చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు, మహిళలకు, బీడీ కార్మికులకు పెంచుతామన్న పెన్షన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ది సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఆర్డీఓ కార్యాలయం ముందు వృద్ధులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలని, పెన్షన్లు 4000 పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ రత్న కళ్యాణికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్, పార్టీ నాయకులు రామ గౌడ్, వినోద్, శ్రీనివాస్, సాదిక్ తదితరులున్నారు.