12 July, 2026 | 12:33 AM

ఆప్ ఎమ్మెల్యేకు పోలీస్ కస్టడీ

02-12-2024 01:44 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఆప్ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. నరేశ్ బల్యాన్ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు పెట్టుకుని బిల్డర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందు కు సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఇటీవల బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ ఆడియో క్లిప్‌ను పరిశీలించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యేను రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా, ఆప్ నేతలు మాత్రం ఆ ఆడియో క్లిప్ నకిలీదని వాదిస్తున్నారు.