12 July, 2026 | 1:31 AM

టిప్పు సుల్తాన్ చాలా క్లిష్టమైన వ్యక్తి

02-12-2024 01:58 AM

విదేశాంగమంత్రి జైశంకర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారతదేశ చరిత్రలో టిప్పు సుల్తాన్ చాలా క్లిష్టమై న వ్యక్తి అని  విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని  ఓ కార్యక్రమంలో భారత చరిత్రకారుడు విక్రమ్ సంపత్ రచించిన టిప్పుసుల్తాన్: ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంట ర్‌రెగ్నమ్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లా డుతూ బ్రిటిష్ వలస నియంత్రణను ప్రతిఘటించిన వ్యక్తిగా టిప్పుసుల్తాన్‌ను అభి వర్ణించారు. టిప్పు సుల్తాన్ చేసిన అనేక సంస్కరణలను  చరిత్ర విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.