క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
డిసెంబర్ 9లోపే పూర్తి చేసేందుకు సోరెన్ ప్రభుత్వం కసరత్తు
రాంచీ, డిసెంబర్ 1: జార్ఖండ్‌లో మంత్రివర్గ విస్తరణపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం దృష్టి సారించింది. డిసెంబర్ 9న ముందే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం హేమంత్ సోరెన్‌తో జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్ ఆదివారం సమావేశమై చర్చించారు. డిసెంబర్ 9న జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాలకు ముందే మంత్రి మండలిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో హేమంత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను కోరనున్నట్టు తెలుస్తోంది. మంత్రిమండలిలో మొత్తం 12 స్థానాలు ఉండగా సీఎం పదవి సహా ఏడు మంత్రిత్వశాఖలను జేఎంఎం తీసుకోగా కాంగ్రెస్ నాలుగు మంత్రిత్వశాఖలు , ఆర్జేడీ ఒక మంత్రిత్వశాఖను పొందేందుకు అంగీకరించాయి.






