నా హీరోయిన్లలో తొలి స్థానం ఆరాధ్యదేవిదే
10-02-2025 12:08 AM
దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ రూపొంది స్తున్న చిత్రం ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిం చిన ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరో యిన్ ఆరాధ్యదేవి ఫొటోలతో స్టిల్స్ ఫొటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ ‘యానిమల్ ఆరాధ్య’ ఫొటో సిరీస్‌ను హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవీ ముఖ్యఅతిథిగా హాజరై ఫొటో సిరీస్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. “అడవి జంతువులతో ఒక అమ్మాయి ఫొటోషూట్ చేయడం సమ్‌థింగ్ స్పెషల్. అందుకే నా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన వారందరిలో మొదటి స్థానం ఆరాధ్యదేవికే ఇస్తాను. ఇది సీక్రెట్. వినూత్న తరహాలో చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నా’ అన్నారు.






