18 April, 2026 | 12:13 AM

ప్రజల భద్రత, భరోసా కోసమే అభయమిత్ర

24-06-2025 12:00 AM

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ

ఏటూరునాగారం,జూన్23(విజయక్రాంతి):  ములుగు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సోమవారం నూగూరు వెంకటాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని చిరుతపల్లి ఆశ్రమ గరల్స్ హైస్కూల్ లో అవగాహన కార్యక్రమానికి హాజరు కావడం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ ని తరిమి కొడదాం- యువతను కాపాడుకుందాం అనే మోటివ్ గురించి అవగాహన కల్పిస్తూ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన మూడు వీడియోలను విద్యార్థిని విద్యార్థులకు ప్రొజెక్టర్ సహాయంతో చూపించి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఏఎస్పి విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి మార్గాన్ని నిర్దేశిస్తూ, పిల్లల వయస్సు నుండి యుక్త వయస్సు వచ్చేవరకు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు.

ఆ పరిణామ క్రమంలో ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, ముఖ్యంగా ప్రస్తుతం మహమ్మారిల ప్రవహిస్తున్న డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలను అలవాటు చేసుకోరాదని తెలిపారు. సమాజంలో చెడు వ్యసనాలకు బానిసనే యువతను మార్చే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు.

దీనితోపాటు ఏటూరునాగారం ఏఎస్పి పోక్సో చట్టం గురించి కూడా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించినారు. తెలిసి తెలియని వయసులో చేసే తప్పుల వలన నిండు జీవితాన్ని నాశనం చేసుకోరాదని మరియు చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది.