18 April, 2026 | 1:52 AM

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

24-06-2025 12:00 AM

చౌటుప్పల్, జూన్ 23(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట గ్రామ పరిధిలో పోలీసులు విధులు నిర్వహిస్తుండగా పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రాగానే వెంటనే తూప్రాన్ పేట గ్రామ పరిధి లో తెల్లవారుజామున రాత్రి 1:15 నిమిషాల సమయంలో వాహనాలు తనిఖీ చేయగా  బొలెరో వెహికల్ నెంబర్ టి జి 29 టి4720 గల దానిని చెక్ చేయగా అందులో ఐదు ఆవులు ఐదు ఎద్దుల ఉన్నాయి.

పోలీసులు డ్రైవర్ పేరు అడగగా లకావత్ నాగేశ్వర్ సన్నాఫ్ బద్రు ఆర్వో మనువానాయక్ తండా, చివ్వెంలా తెలిపినాడు . ధరావత్ రమేష్ ఆదేశాల మేరకు కొమ్మినేపల్లి సంతలో ఖమ్మం ఇట్టి పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్  తరలిస్తూ ఉన్నామని తెలిపాడు. దీనిపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.