24-06-2025 12:00:00 AM
మణుగూరు, జూన్ 23 ( విజయ క్రాంతి ) : అలవి గాని హామీలతో గద్దెనెక్కిన ప్రజా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చే వరకు పోరాడుతామని, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుంట లక్ష్మణ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశం మేరకు బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తక్షణమే పారిశుద్ధ్యని మెరుగుపరచాలని కోరుతూ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్‌మాట్లాడుతూ..అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీల్లో చెత్తను తరలించే ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చావని ధ్వజమెత్తారు.అప్పుపుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించేపరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం పంచాయతీ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి శాపంగా మారుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ గ్రామ పంచా యతీలను దేశం గర్వించే దిశగా తీర్చిదిద్దితే, ఇప్పుడు రేవంత్రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కునారిల్లుతున్నాయన్నారు. విమర్శించారు. ప్రస్తుతం నిధుల్లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందని, నెలనెలా నిధుల్లేక నిర్వహణను గాలికొదిలేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కాలిపోయిన వీధి దీపాలు మార్చడానికి నిధుల్లేక అనేక గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయన్నారు.వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వార్డుల్లో కాలువల్లో పేరుకుపోయిన చెత్తా,చెదారం చెత్తకుప్పల్లో దోమలు, ఇతర క్రిమి కీటకాలు చేరి చెత్త కుళ్ళిపోయి దోమలు ప్రబలి డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు ప్రజలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే వార్డుల్లో చెత్తను తొలగించి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొబ్బల వెంకటప్పయ్య,తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ఆవులనరసన్న,ముద్దంగులకృష్ణ,వేముల లక్ష్మయ్య,తురక రామకోటి,దర్శనాల శ్రీను,రాంబాబు, లక్ష్మి శెట్టి ప్రసాద్, బూర్గులసంజీవరావు,బెన్నీ సరోజ గుర్రం సృజన్, ఆవుల శ్రీనివాస్,జక్కం రంజిత్, తురక శ్రీనివాస్,బోశెట్టి సాయి దీపక్, తాళ్లపల్లినాగరాజు తదితరులు పాల్గొన్నారు.