16 June, 2026 | 12:10 PM

సీఎం, డిప్యూటీ సీఎంలను మర్యాదపూర్వకంగా కలిసిన అభిషేక్ మను సింఘ్యీ

18-08-2024 09:22 PM

హైదరాబాద్: హెటల్ షెర్టాన్ లో కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య హాజరయ్యారు.  రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్యీని ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు.

తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్యీ ఎన్నికయ్యారు.ఆయన అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆమోదించారు. ఈ సందర్భంగా సీఎల్పీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సోమవారం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఆయన నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.ఇదిలా ఉండగా.. అభిషేక్ మను సింఘ్యీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన్న సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగా రాష్ట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమర్కను కూడా ఇవాళ  మధ్యాహ్నం ప్రజాభవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి నామినేషన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు.