వర్షాలు సమృద్ధిగా కురవాలని శివుడికి జలాభిషేకం
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర, జూలై 20: రైతులకు పుష్కలంగా పంటలు పండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవరకద్ర మండల కేంద్రం లోని శ్రీ ఈశ్వర వీరప్పయ్య దేవస్థానంలోని శివాలయంలో శివుడికి జలాభిషేకం ను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివానంద చారి, అర్చకులు నాగరాజు, నాగభూషణ్, మున్సిపల్ చైర్మన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షులు అంజిల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు అంజన్ కుమార్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, బీసీ నర్సింహారెడ్డి, కౌన్సిలర్ అంజలి రామాంజనేయులు, ఎరుకలి బీమన్న, తదితరులు పాల్గొన్నారు. అనంతరం 10వ వార్డు కౌన్సిలర్ అరుణ కుటుంబ సభ్యులు చంద్రమౌళి మరణించడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఓదార్చారు.






