21 July, 2026 | 11:22 AM

కూసుమంచి డీసీసీబీ మేనేజర్ మల్లెల స్రవంతికి అవార్డు

21-07-2026 12:00 AM

కూసుమంచి, జులై 20(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్వహించిన శాఖ మేనేజర్ల సమీక్ష సమావేశంలో కూసుమంచి శాఖ మేనేజర్ మల్లెల స్రవంతి ప్రతిభకు గుర్తింపుగా అవార్డును అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో శాఖ సాధించిన వ్యాపార వృద్ధి, గోల్ లోన్లు, రికవరీలు మరియు ఖాతాదారుల సేవల్లో చూపిన అత్యుత్తమ పనితీరుకు ఈ పురస్కారం లభించింది. కూసుమంచి శాఖకు ఈ గౌరవం దక్కడం పట్ల బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు. మల్లెల స్రవంతి సాధించిన ఈ విజయం ఇతర శాఖలకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.