09-11-2025 07:37:55 PM
దేవరకొండ (విజయక్రాంతి): కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున శ్రీ సీతారామ చంద్రమౌళీశ్వరా స్వామి దేవాలయం నందు గల అయ్యప్ప ఆలయంలో ఊరే నరేష్ - నాగలక్ష్మి దంపతుల కుమారుడు జీవన్ పుట్టిన రోజు సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్దలతో భజన కీర్తనలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు స్వామి ప్రభాకర్ రెడ్డి, కందుల వెంకట్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అయ్య గారు జయ ప్రకాష్ శర్మ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఊరే జనార్ధన్ ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.