29 April, 2026 | 3:49 AM

పంచముఖ ఆంజనేయస్వామి వారికి అభిషేకం

29-04-2026 02:19 AM

గరుడాధివాసం

మంగపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల(మల్లూరు) లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళ వారం ఆలయ ప్రాంగణంలోని పంచముఖ ఆంజనేయస్వామి వారికి స్నపనం కార్యక్రమం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల ( మల్లూరు ) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ తదితరుల ఆధ్వర్యంలో 10 గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం గరుడ పఠ లేఖనం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు గరుడాధివాసం కార్యక్రమం నిర్వహించారు.  ఆలయ కార్య నిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి, దేవాదాయ శాఖ పరిశీలకులు, కురవి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ యర్రంగారి సురేష్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.