09-11-2025 02:07:01 PM
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసంను పురస్కరించుకొని ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి శివాలయంలో పూజారి పొలాస అశోక్ ఆధ్వర్యంలో శివుడికి అభిషేకం, ప్రత్యేక పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిత్య భక్తుడు తొడుపునూరి రాజేంద్రప్రసాద్ భక్త బృందం పాల్గొన్నారు.