calender_icon.png 9 November, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్

09-11-2025 02:11:06 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఇందుర్తి వెంకట్ రెడ్డి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కాంగ్రెస్ పార్టీ లౌకిక పునాదులపై ఏర్పడిందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఇందుర్తి వెంకట్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా,ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం ఆదివారం బోరబండ, రాజ్ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.