calender_icon.png 9 November, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు

09-11-2025 02:03:36 PM

శివంపేట్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట్ మండలంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గూడూరు శ్రీగురుపీఠంలో హైకోర్టు న్యాయవాది, అశోక్ ఎడ్యూకేషనల్ సొసైటీ చైర్మన్, ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్, రమాదేవి దంపతులు కార్తీక శనివారం సందర్భంగా దివ్యమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిరిడి సాయినాథునికి ప్రత్యేక పూజలు, శ్రీదత్తాత్రేయ స్వామికి మహాపూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

కార్తీక దీపోత్సవంలో శివకుమార్ గౌడ్ దంపతులు పాల్గొని స్వామివారి సన్నిధిలో దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీగురుపీఠం ప్రధాన అర్చకులు ఆశు తివారి, శక్తి తివారి ఆధ్వర్యంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారిని శివకుమార్ గౌడ్ దంపతులు దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... గూడూరు శ్రీగురుపీఠంలో దివ్యమూర్తులను దర్శనం చేసుకోవడం, బగలాముఖీ అమ్మవారి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వశ్రీ లా ఛాంబర్స్ న్యాయవాదులు వజ్ఞ హనుమంతు, సాయికిరణ్, పల్లవి, సీఏఓ లిఖిత, సిబ్బంది నల్లపల్లి శ్రీనివాస్, అంబికా, రాజేందర్ రెడ్డి (చిన్న), స్వామివారి సేవకులు కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, బల్కంపేట భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.