calender_icon.png 19 October, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రాజరాజేశ్వర స్వామికి, నందీశ్వరునికి అభిషేకం..

19-10-2025 06:56:45 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని గుడిమిట్టపల్లి శివాలయంలో ఆదివారం మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రదోష సమయంలో జెషెట్టి సుమ రాంప్రసాద్ దంపతులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి, శ్రీ నందీశ్వర స్వామి వారికి మహా రుద్రాభిషేకం చేశారు. అర్చకులు అశోక్ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. వీరికి ఆ మహా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని అశోక్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గుడి మిట్టపల్లి దేవాలయం సామాజిక సేవకుడు తోడుపునూరి రాజేంద్రప్రసాద్ భక్త బృందం పాల్గొన్నారు.