27 February, 2026 | 3:03 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన

27-02-2026 01:23 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో(Kummera Mallanna Jatara) జరిగిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో నిజ నిర్ధరణ కమిటీ కుమ్మెర గ్రామాన్ని సందర్శించనుంది. కమిటీ సభ్యులు గ్రామాన్ని ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరించి బాధితులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్(National Tribal Congress Chairman) బెల్లయ్య నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, పీసీసీ ఆదివాసీ చైర్మన్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి , ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి , నాగర్ కర్నూల్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఘటనపై పూర్తి స్థాయి వివరాలు సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని నేతలు పేర్కొన్నారు.