రాజ్యాంగం రిజర్వేషన్లు రద్దు
బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే జరిగేది ఇదే: రాహుల్
తెలంగాణలోని గ్యారెంటీలు దేశంలో అమలు చేస్తాం
పేద మహిళలకు ఏడాదికి రూ. లక్షా 30 వేలు
దేశంలోని 30 లక్షల ఉద్యోగాల భర్తీ
ఉపాధి హామీ కూలీలకు 400 దినసరి కూలీ
పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం
నిర్మల్, ఎర్రవెల్లి జనజాతర సభల్లో రాహుల్ గాంధీ
ఆదిలాబాద్,(నిర్మల్)/వనపర్తి (గద్వా ల), మే 5 (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మార్చే ప్రయత్నంలో ఉంటే, కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేస్తున్నదని, బీజేపీ మారోమారు అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదని, రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు. రాజ్యాంగం పుస్తకాన్ని చూపుతూ బీజేపీ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి లోని నిర్మల్‌లో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని మోదీ రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకి అని మండిపడ్డారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా రని, ప్రజలకు ఉన్న హక్కులన్నీ తొలగిపోతాయన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులు పండించే పంటలకు మద్దతు ధరతోపాటు ఉపాధి హామీ కూలీలకు కూలీ రేట్లు పెంచుతామని చెప్పారు. ఇలా చెబితే మీడియా, బీజేపీ నాయకులు మాత్రం రైతులను, కూలీలను సోమరిపోతులు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం కొందరు సంపన్నులకు రూ.16 లక్షల కోట్లను కట్ట బెడితే, ఈ విషయాన్ని మీడియా అభివృద్ధి జరుగుతోందని ప్రచారం చేస్తున్న దన్నారు. ఆ డబ్బులతో దేశంలోని పేదలకు ఒక్కరికి రూ.25 వేలు ఇవ్వవచ్చని చెప్పారు. ఈ అంతరాన్ని కాంగ్రెస్ మారుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలోని నిరుద్యోగ యువత కోసం ఉద్యోగం పక్కా అనే స్కీం తెస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మహిళలకు కేంద్రం నుంచి రూ.లక్ష, రాష్త్రం నుంచి రూ.30 వేలు మొత్తం రూ.లక్షా 30 వేలు అందజేస్తామని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింద ని, ఇక్కడ అమలవుతున్న గ్యారెంటీలను దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల అధిపతుల్లో బీసీల సంఖ్య చాలా తక్కువ ఉందన్నారు.
దీన్ని మార్చాల్సి ఉందని చెప్పారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి తొలిసారిగా ఓ ఆదివాసీ మహిళ ఆత్రం సుగుణను బరిలో దించామని, అత్యధిక మెజార్టీతో ఆమెను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో నిర్మల్‌కు చేరుకున్న రాహుల్‌కు సీఎం రేవంత్, మంత్రి సీతక్కతోపాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. అనంత రం సభాస్థలికి చేరుకున్న రాహుల్ గాంధీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మంత్రి సీతక్క, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండ రాం, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని నలిపివేయాలని కుట్ర
పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి, ఇండియా కూటమికి మధ్య ఒక సిద్ధాతం, ఆలోచన కోసం జరిగే ఎన్నికలు అని, ఈ ఎన్నికల్లో ప్రజలందరు కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాల ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. ఆదివా రం జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండల కేంద్ర శివారులో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవిని గెలిపించాలని సీఎం రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు, ఆదివాసులకు, దళితులకు ఏమైనా లభించిందంటే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశంలో ప్రభుత్వం ఉద్యోగాలు దొరికినా ఎలాంటి ఉపాధి దొరికినా అది భారత రాజ్యాంగంతోనే లభించిందన్నారు.
దేశవ్యాప్తంగా 50 శాతం వెనుకబడిన, 15 శాతం దళితులు, 8 శాతం ఆదివాసులు, 5 శాతం బీద వర్గానికి, 15 శాతం మైనార్టీలు ఉన్నారని, వీరందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అని చెప్పారు. రాజ్యాంగాన్ని చించివేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మీ అందరి తరఫున, మీ అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. పదేండ్ల నరేంద్రమోదీ ప్రభుత్వం కేవలం 2, 3 శాతం ఉన్న వ్యక్తుల కోసం పని చేసిందని, ప్రజల కోసం ఏం చేయలేదని, అదానీ, అంబానీ కోసం రూ 16లక్షల కోట్ల రుణాలను బ్యాంకుల నుండి మాఫీ చేయించింద ని గుర్తు చేశారు. ఒక వ్యక్తి అభివృద్ధి కోసం దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీయల్స్, విద్యాసంస్థలు, పోర్ట్సు వంటివి అప్పజెప్పుతూ పేద ప్రజలను, రైతులను మోసం చేసిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లోపు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని, 30వేల ఉద్యోగాలను కల్పించడంతో పాటు 10లక్షల ఆరోగ్య శ్రీ పథకం, రూ 500 గ్యాస్ సిలిండర్, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని అలాంటి కులగణనను చేయకుండా బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే కులగణనను పూర్తి చేస్తామని చెప్పారు. దీనివల్ల భారతదేశ అసలైన ముఖ చిత్రం బయటకు వస్తుందన్నారు. దేశంలో మరొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్ల ప్రకియను ఖతం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దని, పలు సందర్భాల్లో కూడా వాళ్ల నాయకులు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
దేశంలో ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 250లు ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 400లకు పెంచడం జరుగుతుందని, మహిళలకు చేయూత పథకంను రెడింతలు చేయ డం జరుగుతుందన్నారు. మహిళలు, కూలీ లు, వివిధ పనుల్లో రోజుకు 8 గంటలు, ఇంట్లో 8 గంటలు పని చేస్తున్నారని, 16 గంటలు పని చేస్తే కేవలం 8 గంటల వేతనం మాత్రమే వస్తుందని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవ్వరు ఆలోచన చేయని విధంగా కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న పేద వారికి సంబంధించిన జాబితాను తయారు చేయించి అందులో నుండి పేద మహిళలకు నెలకు రూ 8,500 చొప్పున (ఏటా లక్ష) వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుంటే పేదవారిని ధనవంతులుగా చేయడమే లక్ష్యంగా కాంగ్రె స్ పని చేస్తుందన్నారు.
నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొద టి ఉద్యోగం పక్కా పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించి నెలకు రూ 8,500 చొప్పున సంవత్సరానికి లక్ష జమ చేయడం జరుగుతుందన్నారు. 10 ఏండ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, రుణమాఫీ సైతం చేయలేదని తమ ప్రభు త్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేయడంతోపాటు పండించిన పంటకు కనీ స మద్దతు ధరను అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలందరు సుఖసంతోషాలతో కలిసి మెలిసి ఉండే విధంగా పాలనను అందించాల్సిన బీజేపీ ప్రభుత్వం వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతూ గొడవలు పెడుతుందని, విద్వేషాలను కాదు ప్రేమను పంచే విధంగా భారతదేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.




