2 April, 2026 | 11:53 PM

పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్

06-05-2024 01:58 AM

వరంగల్ రిటర్నింగ్, జిల్లా కలెక్టర్ అధికారి ప్రావీణ్య 

వరంగల్ తూర్పు, మే 5: పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్ చేపడుతున్నామని వరంగల్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలలో వినియోగించనున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సీయూల కమిషనింగ్ ప్రక్రియను వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులోని గోదాముల్లో ఆదివారం నిర్వహించగా.. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్‌వీర్ చంద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 శాతం రిజర్వ్ కలుపుకొని వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 279 పోలింగ్ కేంద్రాలకు 1046 బ్యాలెట్ యూనిట్లు, 348 కంట్రోల్ యూనిట్లు, 390 వీవీ ప్యాట్లను 32 టేబుళ్ల ద్వారా కమిషనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తూర్పు నియోజకవర్గానికి సైతం 20 శాతం రిజర్వ్ కలుపుకొని 862 బ్యాలెట్ యూనిట్లు, 287 కంట్రోల్ యూనిట్లు, 322 వీవీ ప్యాట్లను 21 టేబుళ్ల ద్వారా కమిషనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు సహాయ రిటర్నింగ్ అధికారి ఆశ్విని తానాజీ వాకడే, వర్ధన్నపేట సహాయ రిటర్నింగ్ అధికారి సిదం దత్తు, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, రెవెన్యూ అధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు. 

రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి.. 

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వరంగల్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సెగ్మెంట్‌లో 244 పోలింగ్ బూత్‌లకు గాను 956 బ్యాలెట్ యూనిట్లు, 305 కంట్రోల్ యూనిట్లు, 357 వీవీ ప్యాట్లను, పరకాల సెగ్మెంట్‌లో 239 పోలింగ్ బూత్‌లకు 936 బ్యాలెట్ యూనిట్లు, 298 కంట్రోల్ యూనిట్లు, 351 వీవీ ప్యాట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వరంగల్  నియోజకవర్గ కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్, జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ శ్రీనివాస్, ఆర్డీఓ సిదం దత్తు, వెంకన్న, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, పర్యవేక్షకులు విశ్వనారాయణ తదితరులు పాల్గొన్నారు.