29 July, 2026 | 12:49 AM

మైనార్టీ హక్కుల పోరాట సమితి కో ఆర్డినేటర్‌గా అబ్రార్ హుస్సేన్

29-07-2026 12:00 AM

ముషీరాబాద్, జూలై 28(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి (టీఎస్ ఎంహెచ్ పీ ఎస్) రాష్ట్ర కో ఆర్డినేటర్ గా భోలక్ పూర్ కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అబ్రార్ హుస్సేన్ ఆజాద్ నియమితులయ్యారు. మంగళవారం ఆయనకు టీఎస్ ఎంహెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహేబ్ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మైనార్టీల హక్కుల పరిరక్షణ ప్రజాసంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతల అప్పగించినందుకు అబ్దుల్ వాహేబ్ కు కృతజ్ఞతలు తెలిపారు.